ప్రముఖ హీరో పొలంలో కుళ్ళిపోయిన శవం..! షాక్ అయ్యాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో వ్యవసాయ పొలంలో అనుకోని రీతిలో ఓ మృతదేహం బయటపడింది. వార్త తెలియడంతో ఆ హీరో షాక్ కి గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కుళ్ళిపోయిన మృతదేహాన్ని చూసి కంగుతిన్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో తాజాగా షాద్ నగర్ మండలంలోని కేశంపేట పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల వ్యవసాయ పొలం కొన్నాడు. అతని భార్య సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ చూపుతుంది అనే కారణంతో సూదురు హీరో ఆ వ్యవసాయ పొలాన్ని కొన్నాడు. తన భార్య కూడా సేంద్రీయ వ్యవసాయం కొనసాగించడానికి తగిన కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ఆమె పొలానికి వెళ్ళి చెట్లు నాటింది. పొలంలోని కూలీలు పొలాన్ని క్లీన్ చేయడానికి పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఓ గదిలో వారికి అనుకోని రీతిలో ఓ కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది.

మృత దేహాన్ని చూసిన కూలీలు భయానికి గురై ఆ హీరో భార్యకి ఈ విషయాన్ని తెలియజేశారు. అప్రమత్తమైన హీరో భార్య వెంటనే పోలీసులకి ఈ విషయాన్ని తెలియజేసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహం ఉన్న గదిని పరిశీలించాడు.. ఆ మృతదేహం ఎవరిది అనే కోణంలో ఆయన దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి తగిన ఏర్పాటు చేస్తున్నారు. నేడు 19 న మరోసారి ఫారన్ సీక్స్ నిపుణుల ఆధ్వర్యం లో మరోసారి ఘటనా స్థలాన్ని మృతదేహాన్ని పరిశీలించనున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోలీసులు ఆ గదిని సీజ్ చేసి విచారణ ప్రారంభించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: