అర్ధనగ్నంగా రోడ్డుపై రచ్చ చేసిన బాలయ్య నిర్మాత ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

సింహా వంటి పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన నిర్మాత పరుచూరి శివరామ ప్రసాద్ అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ హాల్చ్జల్ చేసాడు. ఆ నిరసన ఏ హీరోపైనో, డైరెక్టర్ పైనో కాదు.., ఏకంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ పై. జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్‌ నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. ఈ విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారు.

నెల క్రితం కంకర తీసుకొచ్చి వీధిలో కుప్పగా పోశారు. ఆనాటి ఈనాటి దాకా పనులు మాత్రం చేపట్టలేదు. సోమవారం రాత్రి కంకరకుప్పల కారణంగా ప్రసాద్‌ కిందపడి గాయపడ్డారు. దీంతో సోమవారం రాత్రి నుంచి అక్కడే బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టే వరకు కదిలేది లేదని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ దెబ్బకు దిగొచ్చారు అధికారులు .ఎంతైనా సెలబ్రేటి కవడంత్ ఎందుకు సీన్ చేసుకోవడం అని బావించారో ఏమో .., ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు పరుగుపరుగున అక్కడికి చేరుకుని.. పనుల్లో ఆలస్యానికి క్షమించమని కాలనీ వాసులను కోరారు. తక్షణమే పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని వివరించారు. వారి వివరణతో తన నిరసన దీక్షను విరమిస్తున్నట్టు శివరామప్రసాద్ ప్రకటించారు. అయితే ఒకసేలబ్రేటి నిరసనకు స్పందించిన అధికారులు అదే రీతిలో సామాన్యుల సమస్యలపై కూడా అంతే వేగంతో స్పందిస్తే బావుంటుంది అని , హైదరాబాద్ రోడ్లా బాధితులు చెప్పుకుంటున్నారు .

Share.

Comments are closed.

%d bloggers like this: