హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘ సైరా ‘ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైబవంగా జరిగింది. రాజమౌళి, చిరంజీవి, రామ్ చరణ్ వంటి తారలు ఎంతమంది ఉన్నా, ఈవెంటులో పవన్ కళ్యాణ్ ఒక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అన్నయను పోగుడుతూ, స్వాతంత్రకారుల గొప్పతనం చెబుతూ, ప్రజా సమస్యలను గుర్తు చేస్తూ స్పీచ్ ఇచ్చాడు. అద్బుతంగా సాగిపోతున్న పవన్ స్పీచ్ లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకోగా, అక్కడ పవన్ కళ్యాణ్ ప్రవర్తనని చూసిన వీక్షకులు అందరు జై పవర్ స్టార్ అనాల్సివచ్చింది. ఈ ఘటన తో తన రియల్ క్యారెక్టర్ బయటపడింది.
పవన్ ఎమోషనల్ గా మాట్లాడుతున్న సమయంలో, కంట్రోల్ తప్పిన ఒక అభిమాని స్టేజిపై పవన్ వైపు దుసుకురావటం జరిగింది. పరుగెత్తుకుంటూ పవన్ కాళ్ళపై పడిపోయిన అభిమానిని పోలీసులు, సెక్యురిటి వాళ్ళు లాక్కేలుతు ఉండగా, సెక్యురిటి పై పవన్ గట్టిగ అరవడం జరిగింది. “ ఉస్కో చోడ్ ధో బాయి, చోడో ఉస్కో “ అంటూ హిందీలో సెక్యురిటి బౌన్సర్ల పై అరిచి, తన అభిమానిని హత్తుకుని బుజం తట్టాడు పవన్ కళ్యాణ్. దానితో ఆ సదురు అభిమాని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అన్ని సినిమా ఫంక్షన్లో అబిమానులు తమ హీరోల కాళ్ళపై పడటానికి రావడం, వాళ్ళని బౌన్సర్లు లాగిపడేయటం సాదారణం అయిపోయింది. కానీ, ఈ ఫంక్షన్లో స్వయంగా పవన్ కళ్యాణే కలుగజేసుకుని.., తన అభిమానిని గుండెలకు హత్తుకోవడం నిజమైన ఎమోషినల్ సీన్ లా మారిపాయింది. ఈ సీన్ అంత కూడా చిరంజీవి కల్ల ముందే జరగటం, చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ వైపు శభాష్ అని వేలెత్తి చెప్పటం జరిగింది.