మాటలు కాదు చేతల్లో చూపుదాం..! ప్రపంచవ్యాప్తంగా పోరాడుదాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచం వ్యాప్తంగా వాతావరణం మార్పు మానవాళిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. క్లైమెట్ ఛేంజ్ ని అధిగమించాలని ప్రధాని మోడీ ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులను అధిగమించేందుకు ప్రపంచం చేస్తున్న కృషి సరిపోదని దేశాలు అన్నీ కలిసి కట్టుగా పోరాడాలని.. అందుకు విప్లమవాత్మకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాటలు సరిపోవని ఇక చేతల్లో చూపెట్టాలని ఆయనక ప్రపంచ దేశాలను కోరారు. సోమవారం (సెప్టెంబర్ 23) న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.

హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ కార్యక్రమం అనంతరం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో కలిసి న్యూయార్క్ లో నిర్వహించిన ఇక్యరాజసమితి వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సభలో మోడీ ట్రంప్ ఏంజెలా మార్కెల్ వంటి ప్రముఖులు దేశ అధినేతలు పాల్గొన్నారు. సభ లో పాల్గొన్న మోడీ కీలక ప్రసంగం చేశారు. ఎప్పటిలాగానే మోడీ తన ప్రసంగాన్ని హిందీ లో మొదలు పెట్టారు.. ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుని అధిగమించడానికి ప్రపంచం చేస్తున్న పోరాటం సరిపోదని పేర్కొన్నారు. అన్నీ దేశాలు కలిసి ముందుకు సాగాలని కొన్ని విప్లవాత్మక మార్పులు చేయాలని ఆయన తెలిపారు.

ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో ఇందుకోసం పనిచేయడం తక్షణ అవసరమని ఆయన తెలిపారు. ప్రకృతి మార్పులని ఎదుర్కొనేలా మానవాళిలో మార్పు రావాలని మోదీ ఆకాంక్షించారు. ప్రకృతిని ఒక అవసరంగా చూడాలని కానీ అత్యాశ పడొద్దని ఆయన దేశాలకు దిశ నిర్దేశించారు. భారత్ ఎప్పుడు ప్రకృతిని ఒక అవసరం గానే భావిస్తుందని ఎప్పుడు అత్యాశ పడదని ఆయన పేర్కొన్నారు. భారత్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రభుత్వం ఎప్పుడో నిష్క్రమించిందని అందుకు నిత్యం కృషి చేస్తుందని ఇలాంటి నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు అన్నీ పాటించాలని ఆయన కోరారు. ఆయన వ్యాఖ్యలు ప్రసంగం ప్రస్తుతం ప్రపంచం లో కీలకంగా మారింది అని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: