అంగాన్ని తేనతో అతికించారు..! వైద్యం లో వండర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మనకి చిన్న దెబ్బ తగిలితే వెంటనే పసుపు పెట్టుకుంటాను.. చర్మం కాలితే వెంటనే తేన పూస్తాము.. ఈ టెక్నీక్స్ మనకి పెద్దల ద్వారా తెలిసాయి. ఇవి మన పూర్వీకులు వాడిన ఆంటిబయోటిక్స్. పురాణ వైద్య శాస్త్రంలో కూడా వీటికి మంచి ప్రత్యేకత ఉంది. కాలం మారినా మనలో కొందరు ఇప్పటికీ పసుపు ను తేనని వాడుతున్నారు. అసలు వీటిని వాడొచ్చా అంటే వాడొచ్చు అనే చెబుతున్నారు వైద్యులు. తాజాగా చోటు చేసుకున్న ఓ వింత ఘటన ఇందుకు నిదర్శనం…! ఓ వ్యక్తి అంగం చీలుకపోతే వైద్యులు తేన పెట్టి అతికించారు. చికిత్స కూడా సక్సెస్ అయ్యింది.. ఇప్పుడు ఈ వైద్య ఎక్స్పరిమెంట్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వివరాల్లోకి వెళితే.. రోస్కిల్డ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి తన అంగం పై చర్మం ఎంత ట్రై చేసినా వెనక్కి వెళ్ళడం లేదని వైద్యులని ఆశ్రయించాడు. వైద్యులు తన అంగాన్ని పరిశీలించగా.. తనకి ‘బలనోపోస్తిటీస్’ అనే వ్యాది ఉండటంతో అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు.. వ్యాది వల్ల అతని అంగం పై చిన్న చిన్న గడ్డలు ఏర్పడ్డాయని వాటిని తొలగించాలని శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స చేస్తుండగా అతని అంగం పై ఉన్న చర్మం చీలిపోయింది. కుట్లు కూడా వేయలేని పరిస్థితి కాబట్టి వైద్యులు తన అంగం చుట్టూ చర్మాన్ని సర్జికల్ ప్లాస్టర్ వేసి అతుకు పెట్టారు. వైద్యులు కూడా పురాణ శాస్త్ర టెక్నీక్ ని వాడారు. తన అంగం చుటూ తేన వేసి ప్లాస్టర్ వేశారు. రెండు వారాలు ఆగి చూడగా అద్భుతం..! తన అంగం పై చర్మం ఏర్పడింది… పూర్తిగా అతుక్కుంది. తేన లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని అందుకే ఇది సంభవం అయ్యిందని వైధ్యులు వెల్లడించారు. పసుపు ను తేనను ఇలాంటి శాస్త్ర చికిత్సలు చేసేటప్పుడు వాడొచ్చని రుజువు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: