బుద్ధుడి బోధన..గాంధీ అహింసా వాదన..! ఇవే మా మార్గాలు..! ప్రపంచానికి మా సూచనలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అది కేవలం తీవ్రవాదం వల్లే సంభావిస్తుందని అందరూఎరిగిన సత్యం. ఇక ఇలాంటి పెనుముప్పుని అందరూ కలిసి ఎదుర్కోవాలని తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు అన్నీ దేశాలు కలిసి రావాలని శుక్రవారం ఐక్యరాజ సమితిలో జరిగిన 74 వ సర్వసభ్య సమేవేశం లో ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్రపంచానికి భారత్ బుద్ధుడిని ఇచ్చిందని యుద్ధాన్ని ఇవ్వలేదని ఆయన అన్నారు. బుద్ధుడు బొధించిన శాంతి సందేశాన్నే భారత్ ప్రపంచానికి బోధిస్తుందని ఆయన తెలిపారు. ఇందుకు ప్రతీకాష్టగా భారత్ ఎప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి సిద్ధపడిందని ఆయన తెలియజేశారు. భారత్ బుద్ధుడు మహాత్మా గాంధీ లాంటి గొప్ప మాహాత్ములు బోధించిన సత్యం అహింస సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సంధార్బంగా మన దేశానికి చెందిన గొప్ప మహాత్ములని మోడీ ప్రపంచానికి గుర్తుచేశారు.. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ, స్వామీ వివేకానంద వంటి మహాత్ములని ఆయన స్మరించుకున్నాడు ఆయన ప్రస్తావన లో వారిని గుర్తుచేశారు.. ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద 1893 లో షికాగోలో ఇచ్చిన చారిత్రక ఉపన్యాసాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉపదేశించిన శాంతి, సామరస్యాలే నేటికీ ప్రపంచానికి భారత్‌ ఇస్తున్న సందేశాలని చెప్పారు. అలాగే తమిళ కవి కనియన్‌ పుంగుంద్రనార్‌ చెప్పిన మాటలను ఉదహరిస్తూ.. మనం అన్ని ప్రాంతాలకు, అందరికీ చెందినవారమని, ఈ అద్వితీయత భారత్‌ సొంతమన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను యావత్‌ ప్రపంచం జరుపుకుంటున్నదని, ఆయన బోధించిన సత్యం, అహింస సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమన్నారు. ఆయన ప్రసంగానికి అక్కడికి వచ్చిన అనేక మంది ప్రముఖులు ఫిదా అయ్యారు.. సభ ముగియగానే ఆయనతో ఫోటోలు సెల్ఫీలు దిగటానికి హోరెత్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: