బన్నీ స్పీడ్ కి మహేష్ కి చుక్కలు కనిపిస్తున్నాయా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

అల వైకుంఠపురములో’ టీమ్ ప్రమోషన్స్ లో దుసుకేల్తుంది. ‘సామజవరగమన’ , ‘రాములో రాముల’ పాటలు విడుదలై యు ట్యూబ్ రికార్డ్స్ ని తిరగ రాస్తు ఒకవైపు ప్రమోషన్స్ లో బన్నీ సత్త చాటుతుంటే, మరోవైపు మహేష్ నుండి ఎలాంటి న్యూ అప్డేట్స్ లేక అనుకున్నంత హైప్ రాక రేసులో వెనక పడిపోతుంది సరిలేరు నికేవ్వరు మూవీ. అప్పుడెప్పుడో మహేష్ పుట్టిన రోజున వదిలిన టీజర్ తప్పితే సరిలేరుకి సరైన ప్రమోషినల్ వీడియో లేకపోవటం మహేష్ ఫాన్స్ లో గుబులు రేపుతోంది.

ఈ యేడాది ‘మహర్షి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీపావళి సందర్భంగా విజయ్ శాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. భారతి అనే లెక్చరర్ పాత్రలో విజయ శాంతి లుక్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు, విజయ్ శాంతితో నవ్వుతున్న ఫోటోను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అయితే ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ పై ఏర్పడ్డ బారి హైప్స్ దృష్ట్యా ఇలాంటి చిన్న చితక ప్రమోషన్స్ ఏమాత్రం సరిపొవట్లేదని మహేష్ ఫాన్స్ అంటున్న మాట.., సంక్రాంతి రేసులో వస్తున్న సరిలేరుకి పోటీగా వస్తున్న అల వైకుంఠపురం తో పోల్చుకుంటూ డీలా పడిపోతున్నారట సూపర్ స్టార్ ఫాన్స్ .
ఒకవైపేమో వరుస సాంగ్ రిలీజెస్ తో మాస్ క్లాస్ అని తేడా లేకుండా బన్నీ దుసుకెళ్తుంటే, మహేష్ మాత్రం ప్రమోషన్స్ లో బన్నీ స్పీడ్ ని రీచ్ కాలేక చతికిలపడిపుతున్నాడు. బన్నీ వదిలిన ప్రతి పాట యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తుంటే,మరో వైపు సరిలేరు డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం “ అన్ని పండగకే చూపిస్తాం ఇంకా రెండు నెలలు టైం ఉంది, అప్పుడే తొందర ఏంటి “ అంటూ కొన్ని వీడియోస్ వదులుతున్నాడు. అయితే సరిగ్గా ఇక్కడే కొన్ని డౌట్స్ కూడా ఫాన్స్ కి వస్తున్నాయి. మూవీ అవుట్ ఫుట్ మీద నమ్మకం లేకే ఇలా ప్రమోషన్స్ చేయటంలేదా, కొంప తీసి అవుట్ ఫుట్ లో ఏదైనా తేడా కొట్టిందా అంటూ మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో చిక్కుకున్నారు..,

Share.

Comments are closed.

%d bloggers like this: