మీకు మాత్రమే చెప్తా.. హిట్టా.. ఫట్టా..? మహా రివ్యూ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ ని హీరోగా పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను తెరకెక్కించాడు. న్యూ ఏజ్ ఫిలిమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయినా విజయ్ , తరుణ్ భాస్కర్ లు చేసిన పబ్లిసిటీతో సినిమాపై ఇప్పటికే వచ్చిన క్రేజీ హైప్, ఈరోజే విడుదలైన ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది, బాక్స్ ఆఫీసు దగ్గర ఈ సినిమా రియల్ టాక్ ఏంటో చుసేద్దామా..!
సినిమా కథ విషయానికి వస్తే చాల సింపుల్ .., టివి ఛానల్ లో పనిచేసే హీరో, డాక్టర్ అయినా హీరోయిన్ తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరి మతాలు వేరైనా, అతి కష్టంగా హీరోయిన్ తో తన ఫ్యామిలీ ని పెళ్ళికి ఒప్పిస్తాడు తరుణ్. రెండు రోజుల్లో పెళ్లి అనగా, హీరో లైఫ్ లో పెద్ద ట్విస్ట్. పెళ్ళికి ముందు ఓ అమ్మాయితో గడిపిన సీక్రెట్ వీడియో నెట్లో లీక్ అవుతుంది. నిమిషనిమిషానికి వైరల్ అవుతున్న ఈ వీడియోని ఎలాగైనా తొలగించి తన పెళ్లి ఆగిపోకుండా హీరో తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్ అభినవ్ గోమతం పడే పాట్లే ఈ సినిమా అసలు కథ.

తన ప్రమేయం లేకుండా హీరో పెళ్లి చేడిపోనుంది అంటే చూసే ప్రేక్షకుడికి హీరోపై సింపతి రావాలి, అది రావాలంటే కథలో ఎమోషన్ ఉండాలి, ఈ ఎమోషన్ పండాలంటే హీరో హీరోయిన్ లవ్ లో పెయిన్ ఉండాలి.., ఇవన్నీ ఉంటేనే ఆడియన్ హీరో లవ్ కి కనెక్ట్ అయ్యి సినిమాని ఫాలో అవుతాడు. కాని ‘మీకు మాత్రమే చెప్తా’ లో సరిగ్గా ఇదే మిస్సింగ్. హీరో హీరోయిన్ ల ప్రేమను బలంగా చుపెట్టకపోవటం సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. ఫ్రెష్ థాట్ తో మొదలైన ఈ సినిమా కథకి గనుక మంచి లవ్ ట్రాక్ పెట్టుంటే మాత్రం.. ఈ సినిమా ఎక్కడో ఉండేది అనే భావన కలుగుతుంది. అయితే ఈ ఒక్క కారణంతో మీకు మాత్రమే చెప్తా ను లైట్ తీసుకోలేము. ఎమోషన్ లో ఫెయిల్ అయినా ఎంటర్టైన్ చేయటంలో ఒకమోస్తరుగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు షమీర్. రైట్ ఫ్రం ద బిగినింగ్ హీరో తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అభినవ్ గోమతం వచ్చే ఫన్ ట్రాక్ మనకి ఎక్కడ బోర్ కొట్టనివ్వదు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ తన కామెడి టైమింగ్ తో మనల్ని మెస్మైరైజ్ చేస్తాడు. అబద్ధాలు చెప్తూ హీరోయిన్ కి దొరికిపోతానేమో అన్న భయంతో చేసిన కన్ఫ్యూజన్ కామెడీని చాలా అలవోకగా చేసేసాడు తరుణ్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, తెల్లారితే పెళ్లి పెట్టుకుని, తన వీడియో తొలగించే ప్రయత్నంలో ఉన్న తరుణ్ కి హీరోయిన్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అంటే హాస్పటల్ లో ఉన్నానని అబద్ధం చెప్పటం, అది నమ్మని హీరోయిన్ వీడియో కాల్ చేయటం, దొరిపోతానేమో అన్న భయం, ఎలాగైనా హీరోయిన్ ని నమ్మించాలన్న డెస్పరేట్ సీన్లో తరుణ్ చేసిన పర్ఫార్మెన్ పీక్స్ లో ఉంటుంది. అతని పక్కన సెటైర్స్ , వెటకారాలతో అభినవ్ పంచెస్ సినిమా ఆధ్యంతం పేలాయి.

అయితే ఎక్కడ పెళ్లి చెడిపోతుందో అన్న ఉత్కంఠత మాత్రం ప్రేక్షకుడికి కలిగించడంలో విఫలమయ్యారు మేకర్స్. పెళ్లి బ్రేక్ అప్ అవుతుందా అన్న పాయింట్ దెగ్గర మొదలైన కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళదు. చాలా చోట్ల అన్ వాంటెడ్ ల్యాగ్స్ కనిపిస్తాయి. ఇక సినిమా కంప్లీట్ గా ట్రాక్ తప్పింది అన్న టైంలో, హీరో తరుణ్ ఇచ్చే ఎండ్ ట్విస్ట్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది. సినిమా గమనాన్నే మార్చే ఈ ట్విస్ట్ తో క్లైమాక్స్ పాస్ అయిపోతుంది. అనసూయ భరద్వాజ్ పాత్రని ఇంకొంచం వాడుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సీరియస్ లవ్ ట్రాక్ లేకపోవటంతో హీరోయిన్ వాణి భోజన్ కి ఎక్కడ పర్ఫార్మెన్ కి స్కోప్ లేదు అనే చెప్పొచ్చు. శివకుమార్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. విజయ్ ప్రొడక్షన్ యావరేజ్ కాగా, దర్శకుడు షమీర్ ఎడిటింగ్ లో ఇంకొంచం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక ఆకారిగా.., ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా జాలి ఫన్ ని ఆస్వాదించే యూత్ కి మాత్రం ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ ఆకట్టుకునే అవకాశం ఉన్నా మాస్ అండ్ ఫ్యామిలీ సెక్షన్స్ కి ఎంతవరకు ఈ చిత్రం రీచ్ అవుతుందో చెప్పటంకష్టమే.
ఇక ఈ సినిమాకి మా మహా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.

Share.

Comments are closed.

%d bloggers like this: