ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో సీన్..! వింటే విజిల్స్ వెయ్యాల్సిందే ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లను షూటింగ్ లో బిజీ చేశేశారు. భారీ చిత్రం కావడం, ఎన్టీఆర్ చరణ్ లు కలిసి నటిస్తున్న చిత్రం అవవటంతో, ఈ ఇద్దరి పై వచ్చే ప్రతి సీక్వెన్స్ పై మునుపెన్నడూ లేని శ్రద్ధ ఆసక్తులు పెడుతున్నాడట రాజమౌళి. ముఖ్యంగా ఎన్టీఆర్ పై మాస్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ దృష్ట్యా, ఎన్టీఆర్ ఇంట్రో ని న భూతొ అన్న రేంజిలో డిజైన్ చేసాడట. ఈ ఇంట్రో సీక్వెన్స్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ అవ్వనున్నట్టు సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. రాంచరణ్ చేస్తున్న అల్లూరి సీతారామ రాజు పాత్ర గురించి అందరికి తెలుసు కానీ ఎన్టీఆర్ చేయబోతున్న కొమరం భీం పాత్ర ఎలా ఉంటుంది, ఆయన హిస్టరీ ఏంటన్నది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్టీఆర్ కి సంబందించిన ఈ పాత్ర గురించి మాత్రం ఇప్పుడు కొన్నిలీకులు వస్తున్నాయి. కొమరం భీం పాత్ర సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. కొమరం భీమ్ ఇంట్రో సీన్ సినిమాలో గూస్ బమ్స్ తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. నార్త్ యూనివర్సిటిలో కొమరం భీమ్ చదువుకునే సమయంలో, యువతలో రోజురోజుకి పెరుగుతున్న స్వతంత్ర కాంక్షను తునిచేసేందుకు ఆంగ్లేయులు కొమరం భీం చదువుకుంటున్న యూనివర్సిటి పై దాడి చేస్తే , వందల మంది స్వతంత్ర కారులను కాపాడే ప్రాసెస్ లో ఎన్టీఆర్ కి ఆంగ్లేయులకు మధ్య భీకర ఫైట్ జరుగుతుందట. అక్కడి నుండే ఎన్టీఆర్ కి స్వతంత్రం పోరాటాపై మక్కువ చూపిస్తాడని , ఆ సీక్వెన్స్ ని రాజమౌళి ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకొనేలా డిజైన్ చేసాడని, అదే రేంజిలో తారక్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితుల నుండి లీకులు వస్తున్నాయి. అయితే చాల రోజుల తరువాత ఎన్టీఆర్ స్టామినాకు రాజమౌళి వంటి సరైన దర్శకుడు దొరకటం, ఎన్టీఆర్ నట దాహాన్ని తీర్చే సీన్స్ ఫైట్స్ సీక్వెన్స్ లు ఆర్ ఆర్ ఆర్ లో పడుతుండటంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్న్ గా నిలిచిపోనుందని విశ్లేషకుల అభిప్రాయం .

Share.

Comments are closed.

%d bloggers like this: